ఫోటో కరపత్రాలు పంపిణీ చేస్తున్న టిడిపి నాయకులు.
విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా) : ఉంగుటూరు మండలం నారాయణపురంలో టిడిపి ఆధ్వర్యంలో సోమవారం భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. టిడిపి అధికారంలోకి వస్తే చేసే కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా టిడిపి మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల టిడిపి కార్యదర్శి నల్లా ఆనంద్ కుమార్, మండల టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు నేకూరి ఆశీర్వాదం, సప్పా వీరబాబు, యెగ్గిన శ్యామల, గురువెల్లి రాజారావు, తదితరులు పాల్గొన్నారు.