గోతుల ఎఫెక్ట్.. నిలిచిపోతున్న వాహనాలు
విశాలాంధ్ర- ఉంగుటూరు : ఉంగుటూరు మండలం బాదంపూడి దాటి వెళ్లాలన్నా… రావాలన్నా బాధలు తప్పవని వాహనదారులు అంటున్నారు. ఉంగుటూరు మండలం బాదంపూడి ఆశ్రమం దాటిన తర్వాత ఆర్ అండ్ బి రోడ్డు గోతుల మయంతో ప్రమాద భరితంగా ఉంది. ఏం మాత్రం ఆదమరిస్తే ప్రమాదం తప్పదు. ఈ గోతులు వలన చాలా వాహనాలు రిపేర్లు వచ్చి ఆగిపోతున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఏలూరు వైపు నుంచి తాడేపల్లిగూడెం వైపు వెళ్లాలన్న, తాడేపల్లి గూడెం నుంచి ఏలూరు వైపు రావాలన్న బాదంపూడి పెట్రోలు బంకు వద్ద నుంచి ఉన్న గోతులతో ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని వెళ్తున్నారు. ద్విచక్ర వాహనాలు , ఆర్టీసీ బస్సులో , ఆటోలో ప్రయాణం చేస్తుంటే కూడా చాలా నరకయాత్రంగా ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గోతులకు భయపడి ద్విచక్ర వాహన ప్రయాణికులు ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనదారులు బాదంపూడి బైపాస్ నుండి పెద్ద నుంచి వెళ్తున్నారు వచ్చేటప్పుడు కూడా పెద్ద తాడేపల్లి నుంచే ఏలూరు వైపు వస్తున్నారు. దూరమైన ప్రయాణం సురక్షితంగా ఉందని వాహనదారులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ రహదారికి కనీసం మరమ్మత్తులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.