విశాలాంధ్ర-చింతలపూడి ” గురువే అన్నింటికీ మార్గదర్శి అని విద్యార్థి జీవితంలో సమాజ పరిణామ క్రమంలో గురువు పాత్ర అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని శాంతివిద్యనికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ నెల్లూరు రవితేజ తెలిపారు.గురువారం గురుపుజోత్సవ వేడుకల్లో భాగంగా చింతలపూడి మండలం రాఘవాపురం లోని శాంతి విద్యానికేతన్ హై స్కూల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ సిబ్బందికి ప్రత్యేక సన్మానాలను చేశారు. గురువు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ. విద్యార్థి యొక్క భవిష్యత్తును తీర్చేదిద్దడంలో ఉపాధ్యాయుని పాత్ర అత్యంత కీలకమైనది అన్నారు. విద్యార్థి జీవితానికి మార్గదర్శి ఉపాధ్యాయుడు అన్నారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ బి మహేశ్వరరావు సీనియర్ ఫ్యాకల్టీ సత్య అంజలి కుమారి పటాన్ మజిద్ ఖాన్ కొప్పుల వెంకటేశ్వరరావు మునగాల శైలజ తదితరులు పాల్గొన్నారు.