Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

రైతులు కొత్త పరిజ్ఞానంతో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు…

జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వరావు…

విశాలాంధ్ర గణపవరం: వరి పండించే రైతులు కొత్త పరిజ్ఞానంతో వ్యవసాయం సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని తప్పనిసరిగా వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలు పాటించాలని
పశ్చిమగోదావరి జిల్లా జిల్లా వ్యవసాయ అధికారి జడ్ వెంకటేశ్వరరావు అన్నారు. గణపవరం మండలం అప్పన్నపేట గ్రామంలో డాక్టర్ వైయస్సార్ గుడ్ ఆగ్రో కల్చరల్ ప్రాక్టీసెస్ (పొలంబడి) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఆకు ముడత పురుగులు జీవిత చరిత్ర విషయాలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం సహాయ వ్యవసాయ సంచాలకులు పి మురళీకృష్ణ, మండల వ్యవసాయ అధికారి యర్రంశెట్టి వెంకట సత్యనారాయణ ప్రసాద్, ఏపీ సీ ఎన్ ఎఫ్ శ్రీలక్ష్మి, డి ఆర్ సి వ్యవసాయ అధికారిణి బాలనాగేశ్వరమ్మ ,సర్పంచ్ నక్కా సూరి బంగారయ్య, ఎంపీటీసీ కొల్లి సత్యనారాయణ, ఎన్ సుధాకరరావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img