ప్రతి ఏటా మాకు ముంపు తప్పదు ఎమ్మెల్యే కి రైతులు మొర
ఇక్కడ యూటీ నిర్మించాలి
ఫోటో లు పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ధర్మరాజు
విశాలాంధ్ర – ఉంగుటూరు ( ఏలూరు): ఉంగుటూరు మండలం బాదంపూడి- వెల్లమిల్లి ఆయకట్టు పరిధిలో కురుస్తున్న వర్షాలకు, ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరద నీరుతో ముంపునకు గురైన వరి చేలును ఉంగుటూరు ఎమ్మెల్యే పత్స మట్ల ధర్మరాజు సోమవారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ..ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారం లభించే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ప్రతి ఏటా నష్టపోతున్నాం :
ప్రతి ఏడాది వర్షాలతో పాటు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు వలన వరి చేలు ముంపునకు గురికావడంతో , అలాగే చేతికొచ్చే సమయంలో పంట పాడైపోవడం నష్టపోతున్నామని రైతులు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు.
ఇక్కడ యూటీ నిర్మించాలి :
ముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ఇక్కడ అండర్ టన్నెలు నిర్మిస్తేనే
సమస్య తీరుతుందని రైతులంటున్నారు . జాతీయ రహదారి నాలుగు రోడ్లు వెడల్పు చేయడంతో అప్పటినుండి ముంపు సమస్య ఉందని రైతులు పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం అనేకసార్లు శాంతియుతంగా ఆందోళన చేసిన ఫలితం దక్కలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
= అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చిన సమస్య అలాగే ఉంది:
బాదంపూడి, వెల్లమిల్లి ఆయుకట్టు ముంపు సమస్య అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు అందరూ వచ్చి చూసి వెళ్లడం తప్ప పరిష్కారం కాలేదు. కాంగ్రెస్, టిడిపి, వైయస్సార్సీపి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు
పరిశీలించి వెళ్లడం జరిగిందని రైతులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పాతూరి విజయ్ కుమార్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పంది రాంబాబు, టిడిపి సీనియర్ నాయకులు కడియాల రవిశంకర్, ఇమ్మని గంగాధర్ రావు, జనసేన, టీడీపీ, బిజెపి నాయకులు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.