Monday, September 25, 2023
Monday, September 25, 2023

రెవెన్యూ లీలలు….

సాగు భూమిలో ఒకరు.. ఆన్ లైన్ రికార్డులో మరొకరు….

విశాలాంధ్ర -జీలుగుమిల్లి: 40 ఏళ్ల నుండి మేమంతా కలిసి భూమి సాగు చేసుకుంటుంటే రెవెన్యూ అధికారులు మరొకరికి ఆన్ లైన్ చేశారంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం పంచాయతీ పరిధిలో తాటి రామన్నగూడెం గ్రామానికి చెందిన కొంతమంది గిరిజనులు తమను అధికారులు మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా మమ్మల్ని అధికారులు మోసం చేశారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన గడ్డం ముత్తయ్య వారసులకు 5 ఎకరాల భూమిని ఏ విధంగా ఆన్ లైన్ భూమిని ఏ విధంగా చేసుకున్నారో చెప్పాలని అధికారులను నిలదీస్తున్నారు. సర్వే నెంబర్ 95లో సబ్ డివిజన్ గా చేసి అధికారులు లంచాలకు కక్కుర్తి పడి ఆన్ లైన్ చేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. రికార్డు పరంగా ఆ భూమి మాకు చెందుతుందని ఆ భూములకు రావద్దు అని బెదిరిస్తున్నారని వాపోయారు. ఏళ్ల తరబడి మా గిరిజనులంతా సాగు చేసుకుంటుంటే వేరే వారికి ఆన్ లైన్ చేసి మా మధ్యన రెవిన్యూ అధికారులు గొడవలు పెడుతున్నారని గిరిజనులు వాపోయారు. ఇకనైనా మేము సాగు చేసుకుంటున్న భూములకు అధికారులు ఆన్ లైన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుంజ సోమరాజు, సరియన్ సింగప్ప, కుంజా వెంకటేష్, మడకం ముత్యాలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img