Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ముంపు బాధితులకు పర్వతనేని రూ.3 లక్షల ఆర్థిక సాయం…

టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి….

విశాలాంధ్ర -చాట్రాయి: వేలేరుపాడు వరద బాధితులకు తెలుగు దేశం పార్టీ నూజివీడు నియోజకవర్గ నాయకులు పర్వతనేని గంగాధర్ రూ.3 లక్షల విలువైన కూరగాయలను అందజేసినట్లు పార్టీ ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవా రెడ్డి తెలిపారు. గురువారం వేలేరుపాడు గ్రామంలో వరద బాధితులకు టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ ఎంపీ మాగంటి బాబు చేతుల మీదుగా నిత్యావసరాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం, అనధికారం అనేదానితో సంబంధం లేకుండా ఆపదలో ఉన్న వారికి అండదండగా ఉండేది టిడిపి మాత్రమే అన్నారు. ముంపు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యంచెందిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కృష్ణ మిల్క్ యూనియన్ డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు, చాట్రాయి మండల మాజీ ఎంపీపీ కందుల కృష్ణ, తెలుగు రైతు జిల్లా మాజీ కార్యదర్శి బొంతు సత్యనారాయణ, ఎస్ సి సెల్ చాట్రాయి మండల అధ్యక్షులు కల్లేపల్లి ప్రభాకర్, పర్వతాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు
బొర్రా నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img