విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా ) : పుస్తక పఠనం ద్వారా విజ్ఞాన సిద్దిస్తుందని, విద్యార్థి దశనుంచి గ్రంధాలయాలను సద్వినియోగం చేసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. భీమడోలు శాఖా గ్రంధాలయంలో 56వ గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సమావేశం, బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం అమ్మవార్ల గుడి మంగళవారం వద్ద జరిగింది. గ్రంథపాలకుడు కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తుమ్మల ఉమామహేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిధులుగా సర్పంచ్ పాము సునీత మాన్సిగ్, జడ్పీటీసీ తుమ్మగుంట భవానీ రంగ, భీమడోలు సిబి బీబీ రవికుమార్, మాజీ ఏఎంసి చైర్మన్ ఇంజేటి నీలిమ జూనియర్, ఎంఈఓ భాస్కర్, మండల వైయస్సార్ కన్వీనర్ రావిపాటి సత్య శ్రీనివాస్ తదితరులు ప్రసగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పుస్తక పటనాన్ని నిత్యజీవితంలో కోరారు. విద్యావేత్త జటావల సాయిరాంను ఘనంగా సత్కరించారు.అనంతరం 130 మంది విద్యార్థులకు బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి రామకుర్తి నాగేశ్వరావు, గ్రామాపార్టీ అధ్యక్షులు మద్దాల అప్పారావు, మండల మానవతా ఛైర్పర్సన్ నూకరాజు,రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మండే సుధాకర్, పెదవున ఉపాధ్యాయులు బి. శ్రీనివాసరావు,పెద్దలు ఏడుకొండలు, సవలం నాని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు.