Monday, September 25, 2023
Monday, September 25, 2023

వరద తగ్గి యధాస్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాలు, మెడికల్ క్యాంపులు కొనసా గించాలి

ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి

విశాలాంధ్ర – భీమవరం : గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి ముఖ్య మంత్రి వరద ప్రభావం ఉన్న జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు .
విశాఖపట్నం జిల్లా నుండి జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి, భీమవరం జిల్లా కలెక్టరేటు వీడియో కాన్ఫరెన్స్ హలు నుండి జిల్లా జాయింటు కలెక్టరు ఎస్. రామ్ సుందర్ రెడ్డి, జిల్లా యస్ పి యు. రవి ప్రకాష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాల కలెక్టర్లు వరద తగ్గి యధాస్థితికి వచ్చే వరకు పున రావాస కేంద్రాలు, సహాయక కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కొనసాగించాలన్నారు. బాధితులు ఇంటికి వెళ్ళేవరకు తగు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాల నుండి తిరిగి వెళ్లే సమయంలో ఒక్కొక్క కుటుంబానికి రూ.2 వేలు, సింగిల్ గా ఉన్నవారికి ఒక వెయ్యి చొప్పున ఇచ్చి పంపాలని ఆదేశించారు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ప్రతి కుటుంబానికి సాయం అందాలన్నారు. వరద నీరు తగ్గిన తరువాత వివిధ రకాలు పంటలు, ఇండ్లు, రహదారులు, కల్వర్టులు, మత్స్య కారులు పని ముట్లు, తదితర వాటి నష్టం అంచానాలు సిద్దం చేయ్యాలన్నారు. రానున్న సోమ, మంగళ వారంలో ఏదో ఒక రోజు రాష్ట్రంలోనీ వరద ప్రభావిత జిల్లాలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. మా జిల్లా కలెక్టరు బాగా చూసుకున్నారు అనే మాట వినబడాలి, మంచి పెరుతేవాలని ముఖ్యమంత్రి జగన్ఈ సందర్భంగా అన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి కె కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి ఏ.దుర్గేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.డి. మహేశ్వరరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.కె. మురళీ కృష్ణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img