Friday, December 8, 2023
Friday, December 8, 2023

గ్రామీణ ప్రాంత మహిళలకు స్వయం ఉపాధి

  • తపన ఫౌండేషన్ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాలతీ రాణి

విశాలాంధ్ర – నిడమర్రు: గ్రామీణ ప్రాంత మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు తపన ఫౌండేషన్ ద్వారా ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శరణాల మాలతీరాణి అన్నారు. శనివారం నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామంలోని బీసీ కమ్యూనిటీ హాల్ లో తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని శరణాల మాలతీరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాలతీ రాణి మాట్లాడుతూ కుట్టు శిక్షణ పొందడం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఏర్పడుతుందని అని, తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి చౌదరి సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగి తన వంతు సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో 2008 నుండి తపన ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించటం సామాన్య విషయం కాదని ఆమె అన్నారు. మూడు నెలల పాటు నిర్వహించే ఈ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రతి మహిళా సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని తపన ఫౌండేషన్ ప్రతినిధి శివ గణేష్ కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి
నగరపాటి సత్యనారాయణ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అడపా శోభారాణి, జిల్లా మానవత సభ్యులు సాగిరాజు జానకిరామరాజు,బంగార్రాజు,బిజెపి మండల అధ్యక్షులు వంగా భాస్కరరావు, శివగంగా తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img