విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా ): ఉంగుటూరు గ్రామానికి చెందిన సీనియర్ టైలరింగ్ సంఘం నాయకుడు చింతలపూడి సర్వేశ్వరరావు(75) ( బొంబాయి టైలర్ ) గుండె పోటుతో మృతి చెందారు. సర్వేశ్వరరావు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ అంటే వీర అభిమాని. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం విశేష కృషి చేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆది నుంచి పార్టీలో ఉన్న ఆ పార్టీలు గుర్తించకపోయినా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి. ప్రజా ప్రతినిధులు, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, మండల టైలరింగ్ సంఘం నాయకులు బుధవారం సర్వేశ్వరరావు భౌతికయాన్ని సందర్శించి సంతాపం వ్యక్తం చేశారు. సర్వేశ్వరరావుకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.