Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

శ్రీవెంకటేశ్వర కళాశాలలో నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ కార్యక్రమం…

శిక్షణ తీసుకున్న నిరుద్యోగులకు ధ్రువపత్రాలు అందజేత…

విశాలాంధ్ర భీమడోలు: నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భీమడోలు శ్రీవెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన నైపుణ్య అభివృద్ధి సంస్థ శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం కళాశాల ఆవరణలో జరిగింది.ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లామేనేజర్ ఇ.తమ్మాజిరావు పాల్గొన్నారు. ఈసందర్బంగా 3 నెలలు శిక్షణలో పాల్గొన్న 60మంది నిరుద్యోగ యువతి యువకులకు కళాశాల ప్రిన్సిపాల్ బొమ్ము రవికుమార్, స్కిల్ హాబ్ స్పోక్ రాము తో కలిసి తమ్మాజిరావు ద్రవపత్రాలను అందజేసారు. ఈసందర్బంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండవ ఫేస్ లో భీమడోలు శ్రీవెంకటేశ్వర కళాశాలలో స్కిల్ హబ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షణలో పాల్గొన్న యువతీ యువకులకు అకౌంట్ ఎక్సిక్యూటివ్ కోర్సు, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు మూడునెలలపాటు శిక్షణనిచ్చి నేడు వారికి శిక్షణ ధ్రువపత్రాలను అందజేసామన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ బొమ్ము రవి కుమార్ మాట్లాడుతూ స్కిల్ హబ్ రాష్ట్రనైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతియువకులకు ఉద్యోగ ఉపాధికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు హర్షణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ హబ్ ఎపి ఎస్ ఎస్ డి సి స్పోక్ రాము, స్కిల్ హాబ్ కోఆర్డినేటర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img