జిల్లాలో ఎక్కడా ధర్నాలకు, నిరసనలకు, బంద్ కు అనుమతి లేదని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. బస్సుల రవాణాకు ఆటంకాలు కలిగించినా, నిరసన, ధర్నాలు చేపట్టినా… పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జన జీవనానికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించినా, రోడ్లపైకి వచ్చి అల్లర్లు చేసినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పిలుపునిచ్చిన బంద్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.