Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

బీసీలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీకే మద్దతు

గూడూరు వెంకటేశ్వరరావు

విశాలాంధ్ర – ఉండి : బడుగుబలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లను కల్పించిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని ఆల్ ఇండియా బిసి ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గూడూరు వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం ఉండిలో రాష్ట్ర నాయకులు చిప్పాడ చంద్రశేఖర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో గూడూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బడుగు ,బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఏ పార్టీకైనా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ బీసీ కులాలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటుచేసి వాటికి నిధులు కేటాయించకపోవడంతో వాటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఒక్కో కార్పొరేషన్ కు రూ.1000 కోట్లు సంవత్సరానికి నిధులు మంజూరు చేయాలని వాటి ద్వారా బడుగు బలహీన వర్గాలు చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తారన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 26 శాతానికి కుదించడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ప్రాధాన్యత తగ్గిందన్నారు. బీసీలకు 26 శాతం నుండి 50 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. 2021లో బీసీ కులాల వారీగా కుల గణన చేస్తానని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత మాట తప్పడం దారుణం అన్నారు. ముఖ్యమంత్రి జగన్ బీసీల కులాల వారీగా చేసిన కుల గణన బహిర్గతం చేయాలని వెంకటేశ్వరరావు కోరారు. సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిన బిసి కులానికి చెందిన ప్రధాని నరేంద్ర మోడీ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బీసీ సంఘంలో పుట్టిన వారే రాజకీయంగా పైకి ఎదిగి మిగిలిన వారిని తొక్కేయడానికి చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్ కోసం 40 సంవత్సరాల నుంచి తాము పోరాటం చేస్తున్నామని వారు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయించిన రాజకీయ పార్టీలకు బీసీ సంఘాల మద్దతు తెలుపుతామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయనకు శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుక్కల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కండిబోయిన సుబ్రహ్మణ్యం, నరసాపురం ఇంచార్జ్ మల్లాడి వెంకటేశ్వర్లు, పాలకోడేరు మండలం అధ్యక్షులు దొమ్మేటి వేణుగోపాలరావు, అత్తిలి మండల అధ్యక్షులు పోలవరపు వెంకట సత్యనారాయణ, ఆకివీడు మండల నాయకులు పట్నాల శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img