విశాలాంధ్ర- ఏలూరు: ఏలూరు అసెంబ్లీ సీపీఐ అభ్యర్థి బండి వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ నూజివీడు ఏరియా కమ్యూనిస్టు సమితి రూ.లక్ష విరాళం అందజేసింది కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నేత కొమ్మన నాగేశ్వరరావు, అన్నపూర్ణల కుమారుడు భూపేశ్, కుమార్తె సంధ్య లక్ష్మి రూ.50 వేలు విరాళంగా మంగళవారం ఏరియా సమితికి అందజేశారు. నూజివీడు ముఠా వర్కర్స్ యూనియన్ రూ.5,000, పి. కృష్ణంరాజు (మంకొల్లు), రూ.5,000, చలసాని బాలకృష్ణ (పోతిరెడ్డిపల్లి) సోదరులు రూ.5,000, శివ (నూజివీడు) రూ.5,000, ఇతరుల ద్వారా వసూలు చేసిన మొత్తం రూ.లక్ష మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర నాయకులు జల్లి విల్సన్, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణ చైతన్యకు అందజేశారు. వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు చలసాని వెంకట రామారావు, నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాయకుల లక్ష్మణరావు పాల్గొన్నారు.