తహసీల్దార్ కు వినతిపత్రం అందజేస్తున్న సిపిఐ నాయకులు
విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న రైతుల సమస్యలు పరిష్కారంచాలని సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్ కు వలిబాషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కారంచడంలో వీఆర్వోలు కాలయాపన చేస్తూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని రైతులు వీఆర్వో నరసన్న దృష్టికి పలుమార్లు విన్నవించినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని ఆరోపించారు. కావున తహసీల్దార్ స్పందించి వీఆర్వో నరసన్నను వేరే గ్రామానికి బదలీ చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు ఈరన్న, రాముడు తదితరులు పాల్గొన్నారు.


