Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

అట్లాంటి చరిత్ర భారత్‌కు లేనే లేదు : రాజ్‌నాథ్‌ సింగ్‌

ఇతర దేశానికి చెందిన భూభాగాన్ని ఆక్రమించడం, దాడులకు తెగబడం వంటి చరిత్ర భారత్‌కు లేనే లేదని, అటువంటి మనస్తత్వం ఉండి ఉంటే 1971 లో జరిగిన యుద్ధంలోనే వారి భూమిని ఆక్రమించుకునేవారమని, భారత్‌కు అలాంటి బుద్ధే లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. అయితే ఆ దేశం పేరు తాను ఉచ్చరించనని అన్నారు. . ఫిక్కీ ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్‌నాథ్‌ పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో సైన్స్‌, టెక్నాలజీలో అద్భుతమైన నైపుణ్యం ఉన్న వారు దేశంలో ఉన్నారని, ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు చెందిన కంపెనీలకు భారతీయులే సీఈవోలుగా ఉంటున్నారని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, అభివృద్ధి వైపు బాటలు వేస్తోందని చెప్పారు.ఆరోగ్య, విద్య రంగాల్లో ప్రైవేట్‌, పబ్లిక్‌ పెట్టుబడులు పెరగాలని తాము బలంగా కోరుకుంటున్నామని, ఆ వైపుగా అడుగులు కూడా పడుతున్నాయని అన్నారు. ఈ రెండు రంగాల్లో పెట్టుబడులను బాగా ఆకర్షించి, ప్రపంచంలోనే భారత్‌ను మెరుగైన స్థానంలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img