Friday, September 30, 2022
Friday, September 30, 2022

అణువణువూ జల్లెడ

. బీఆర్టీఎస్‌ రోడ్డుపై పోలీసు పహారా
. జగన్‌ సర్కారు ఉక్కిరి బిక్కిరి
. సీఎం నివాసం వద్ద భారీ భద్రత
. ఏపీలో ఇబ్బందికర వాతావరణం ఉద్యోగ సంఘాలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : కాంట్రిబ్యూటీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌) రద్దు కోసం ఉపాధ్యాయ, ఉద్యోగులు తలపెట్టిన ఉద్యమాల నిర్వీర్యానికి పోలీసుల శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సీఎం జగన్‌ నివాసం దగ్గర సెప్టెంబర్‌ ఒకటి టెన్షన్‌ నెలకొంది. సీఎం ఇల్లు ముట్టడికి ఏపీసీపీఎస్‌ యూఎస్‌ సంఘం పిలుపునిచ్చింది. జగన్‌ నివాసానికెళ్లే అన్నిమార్గాలను పోలీసులు మూసివేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా భద్రతా లోపాలు జరగకుండా అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. జగన్‌ ఇంటి సమీపంలో రక్షణగా కిలోమీటర్ల మేర ముళ్ల కంచె ఏర్పాటు చేశారు. ముందస్తు భద్రతా చర్యల పేరుతో పోలీసులు అణువణువూ జల్లెడ పడుతున్నారు. ఉద్యమకారులను నిర్బంధిస్తూ, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా డీఈవోలకు ఉత్తర్వులు జారీజేసి ఉపాధ్యాయులను బెదిరింపు చర్యలు చేపడుతున్నారు. దీన్ని పది వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిరచాయి. సీపీఎస్‌ రద్దు కోసం సెప్టెంబరు 1న సీఎం నివాస ముట్టడికి, చలో విజయవాడ మిలియన్‌ మార్చ్‌కు ఏపీ సీపీఎస్‌ సంఘాలు వేర్వేరుగా ఉద్యమాలకు పిలుపునిచ్చాయి. ఈ రెండు ఉద్యమాలకు ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు సంఫీుభావం ప్రకటించాయి. దీంతో ఉద్యమ స్వరూపం పూర్తిగా మారిపోయింది. చలో విజయవాడను ఈనెల 11కు వాయిదా వేసినట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడిరచాయి. రాష్ట్రంలో ఇబ్బందికర వాతావరణం ఉండటంతో వాయిదా వేసినట్లు ప్రకటించాయి. ఉద్యోగులకు నోటీసులు, బైండోవర్లు, ఇతర కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర నలుమూలలా ఉప్పెనలా ఉద్యోగులు తరలివచ్చేందుకు సిద్ధమవ్వగా, ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును సైతం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఒక వైపు అధికార యంత్రాంగంతో శాఖా పరమైన చర్యలకూ, మరోవైపు పోలీసు బలగాలతో నోటీసులు, కేసులతో ఉద్యమ అణచివేతకు శతవిధాలా సర్కారు ప్రయత్నిస్తోంది. విజయవాడ కేంద్రంగా పోలీసు బలగాలు మాక్‌ బందోబస్త్‌, కవాతులు చేపడుతూ, ప్రజలను, ఉద్యోగులను భయభ్రాంతులను గురిచేస్తున్నాయి. స్పెషల్‌ టీమ్‌ బలగాలు భారీగా విజయవాడలో మకాం వేసి, నిఘా చర్యల్లో నిమగ్నమయ్యాయి. గుణదల`బీఆర్టీఎస్‌ రోడ్డు దగ్గర పెద్దఎత్తున పోలీసు బలగాలు వచ్చి, సీపీఎస్‌ ఉద్యమానికి తరలివచ్చే వారిని ఎలా అడ్డుకోవాలనే దానిపై ముందస్తు చర్యల్ని ఆరంభించింది. సీఎం నివాస పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా చర్యలు చేపట్టి, సీఎం నివాసం మార్గంలోని రహదారిపై ముళ్ల కంచెవేశారు. సీసీ కెమెరాల సంఖ్యను పెంచి నిఘా విస్తృతం చేశారు. సీఎంతో డీపీజీ రాజేంద్రనాథ్‌రెడ్డి భేటీ అయ్యారు. సీపీఎస్‌ రద్దుపై చలో సీఎం ఇంటి ముట్టడి, మిలియన్‌ మార్చ్‌కు ఉద్యోగులు పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎంతో డీజేపీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉద్యోగులను బైండోవర్‌ పరిధిలోకి తీసుకోవడాన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వం వైఖరిపై ప్రతిపక్షాలు సైతం తూర్పారబడుతున్నాయి. ఇచ్చిన హామీలను జగన్‌ నెరవేర్చకుండా, శాంతియుత ఆందోళనకు ఉద్యోగులు పిలుపునిస్తే, వాటిని అణచివేయాలని చూడటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తమ నిరసన తెలిపే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించేలా ప్రభుత్వ చర్యలున్నాయని మండిపడుతున్నారు. తమను సంఘ విద్రోహ శక్తులుగా ప్రభుత్వం చూస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తే, పోలీసులకూ మేలు జరుగుతుందని, తమ ఆందోళనకు సహకరించాలని కోరుతున్నారు.
సీపీఎస్‌ రద్దు చేయాల్సిందే: ఏపీ సీపీఎస్‌ఈఏ
ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్‌ను సీఎం జగన్‌ రద్దు చేయాల్సిందేనని ఏపీ సీపీఎస్‌ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉద్యోగుల్ని నిర్బంధించి తమ ఉద్యమాన్ని ఆపలేరని, ప్రభుత్వ చర్యలు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేలా ఉన్నాయన్నారు. మిలియన్‌ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరామని, నిరాకరించినా వెనక్కి తగ్గేదే లేదని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం చెప్పే జీపీఎస్‌ విధానాన్ని తాము అంగీకరించ బోమన్నారు. సీపీఎస్‌ ఉద్యోగుల ఆందోళన లకు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంక ట్రామిరెడ్డి మద్దతు తెలిపారు. సీపీఎస్‌ బ్లాక్‌డేలో పాల్గొనా లని నిర్ణయించామన్నారు. పాత పెన్షన్‌ విధానానికి ప్రభు త్వం ఒప్పుకుంటే, ఉద్యోగులు ఒక మెట్టు దిగుతారన్నారు.
నిర్బంధం తగదు: వామపక్షాలు
సీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ ఆందోళన జరుపు తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం ప్రయోగించడాన్ని 10 వామపక్ష పార్టీలు ఖండి స్తున్నాయి. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామ కృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ వై.సాంబశివరావు, సీపీఐం(ఎం ఎల్‌) రాష్ట్ర నాయకులు జాస్తి కిశోర్‌బాబు, ఎంసీపీఐ (యూ) కాటం నాగభూషం, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర నాయకులు ఎన్‌.మూర్తి, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రస చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ఎస్‌యూసీఐ(సీ) రాష్ట్ర నాయకులు బి.ఎస్‌.అమర్‌నాథ్‌, ఫార్వర్డ్‌ బ్లాక్‌ పీవీ సుందరామరాజు, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు జానకి రాములు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2004 నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయు లకు అమలవుతున్న సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, సామాజిక భద్రతను కల్పించే ఓపీఎస్‌ విధానాన్ని అమలు చేయాలని వామపక్షాలు డిమాండ్‌ చేశాయి. జగన్‌ హామీ ఇచ్చి మూడేళ్లవుతున్నప్పటికీ, ఇంతవరకు అమలు చేయ నందుకు నిరసనగా ఆందోళన చేస్తుంటే, వారిని నిర్బం ధించడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అందరు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోలీ సుల ద్వారా బైండోవర్‌ నోటీసులు ఇస్తూ లక్ష, రెండు లక్షల డిపాజిట్‌ కట్టాలని, పాల్గొనబోమని లేఖలు తీసు కుంటూ, అవసరమైతే క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చించి, పాత పెన్షన్‌ విధానం అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img