Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

అద్దె గర్భానికీ ప్రసూతి సెలవు
ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
అద్దెగర్భం (సరోగసీ) ద్వారా బిడ్డను తీసుకున్న తల్లికి మెటర్నరీ సెలవు మంజూరు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెదనందిపాడు మండలం ఉప్పలపాడు హైస్కూల్‌లో పని చేసే టీచర్‌కు మెటర్నరీ లీవ్‌ ఇవ్వకపోవడంపై ఆమె కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు, మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాల్సిందేనని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినప్పటికీ, ఆ తరువాత ఆ బిడ్డకు అండం ఇచ్చిన తల్లికీ మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాల్సిందేనని హైకోర్టు సూచించింది. అలాగే బిడ్డను పెంచేందుకు తల్లికి మూడు నెలల పాటు మెటర్నిటీ లీవ్‌ ఇవ్వాలని ఆదేశించింది. మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్‌ 2017కు తెచ్చిన సవరణల ద్వారా సెలవు ఇవ్వాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img