చిక్కుల్లో పడ్డారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్. ఆయనపై హుష్ మనీ కేసు నమోదయింది. ఈ కేసులో క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కొన్న మొట్టమొదటి అమెరికా మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2016 ఎన్నికల ప్రచార సమయంలో పోర్న్ స్టార్‌కు డబ్బు చెల్లించడంపై న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్ పై అభియోగాలు మోపింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది డబ్బు చెల్లించారనడంపై ఇన్ని సంవత్సరాల దర్యాప్తు తర్వాత న్యూయార్క్‌లో ఆరోపణలు వెలుగుచూశాయి. స్టార్మీ డేనియల్స్‌కు 130,000 డాలర్ల చెల్లింపులపై విచారించిన తర్వాత ట్రంప్ పై గ్రాండ్ జ్యూరీ నేరారోపణ చేసింది. కాగా ఈ ఆరోపణలు ట్రంప్ ఖడించారు. 2024లో మరోసారి అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ట్రంప్ తనపై చేస్తున్న ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమని ఆరోపించారు. తాను అమాయకుడినని ఓ ప్రకటనలో ట్రంప్ పేర్కొన్నారు. 2006వ సంవత్సరంలో ట్రంప్ సాగించిన లైంగిక వేధింపుల గురించి మౌనంగా ఉన్నందుకు బదులుగా తనకు డబ్బు అందిందని స్టార్మీ డేనియల్స్ చెప్పారు. 2018వ సంవత్సరంలో ఆరోపణలు వచ్చినప్పటి నుంచి డేనియల్స్‌తో తనకు ఎలాంటి లైంగిక సంబంధం లేదని డొనాల్డ్ ట్రంప్ ఖండించారు.