Friday, February 3, 2023
Friday, February 3, 2023

అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏండ్లకు పెంపు..!


అమ్మాయిల కనీస వివాహ వయసుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. మహిళల కనీస వివాహ వయసు18 సంవత్సరాలు కల్పిస్తూ గతంలో కేంద్రం చట్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ కనీస వయసును 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం దేశంలో అబ్బాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లు. అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే గత కొంతకాలంగా అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఈ అంతరం తొలగించాలని అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న వయసులోనే గర్భం దాల్చడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోని కేంద్రం ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు చేపట్టింది. బాల్య వివాహాల నిషేధ చట్టం, ప్రత్యేక వివాహ చట్టం, హిందూ వివాహ చట్టంలో సవరణలు తీసుకొచ్చి దానికి ఒక రూపం ఇవ్వనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నీతి ఆయోగ్‌లో జయ జైట్లీ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చేసిన సిఫార్సు మేరకు ఈ విధమైన మార్పులను కేంద్రం తీసుకురానుంది. గతేడాది జూన్‌లో ఏర్పాటైన టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ.. ఆరు నెలల్లోనే నివేదిక సమర్పించింది. మొదటి బిడ్డకు జన్మనిచ్చే సమయానికి 21 ఏళ్లు ఉండాలని టాస్క్‌ఫోర్స్‌ కీలక సూచన చేసింది. టాస్క్‌ఫోర్స్‌ సూచనలతో.. ఒక నివేదికను కేంద్రానికి నీతి ఆయోగ్‌ అందించింది. నీతి ఆయోగ్‌ నివేదికపై నిన్నటి క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
గతేడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని మోదీ తొలిసారి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.పౌష్టికాహార లోపం నుంచి ఆడపిల్లలను రక్షించాలంటే వారికి సరైన సమయంలో పెళ్లి చేయాలని మోదీ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img