సస్పెండైన వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు
. ‘సజ్జల’ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు
. తెరపైకి ఉండవల్లి శ్రీదేవి
. త్వరలో రిటర్న్‌గిఫ్ట్ ఇస్తానంటూ వ్యాఖ్య
. అదేబాటలో ఆనం రామనారాయణరెడ్డి
. అధికార పక్షం ఎదురుదాడి
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: వైసీపీకి చెందిన నలుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వేటు వేసినప్పటికీ… ఆ పార్టీలో అలజడి ఇంకా కొనసాగుతోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటులో వైసీపీ ఓటమికి కారణం క్రాస్ ఓటింగేనని అధిష్టానం నానా హడావుడీ చేయడం… ఆ తర్వాత నలుగురు రెబల్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెండైన ఎమ్మెల్యేలు మరింతగా తిరుగుబాటు చేయడంతో వైసీపీ అధిష్టానంలో ఆందోళన మొదలైంది. ఇంతకాలం మౌనంగా, మధ్యేమార్గంగా ఉన్న రెబల్ ఎమ్మెల్యేలంతా పార్టీ సస్పెన్షన్ అనంతరం ఒక్కొక్కరూ నోరు విప్పుతున్నారు. మొన్నటి వరకు పార్టీలోని ముఖ్య నేతలపైనే దాడికి దిగగా… ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ లక్ష్యంగా ఆరోపణలు గుప్పించడంతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రెండు రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ ప్రచారం రాగా… ఆమె ఆదివారం పక్క రాష్ట్రంలోని హైదరాబాద్ నుంచి మీడియా ముందుకు వచ్చారు. తనకు ప్రాణహాని ఉందని, అందుకే హైదరాబాద్‌కు వచ్చినట్లు వివరించుకున్నారు. జగన్ దెబ్బకు తన మైండ్ బ్లాక్ అయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను అమ్ముడుపోయానంటూ ఆరోపించిన వారికి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ ప్రకటించారు. పార్టీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి తీరుతోనే ఇదంతా జరిగిందని, తనకు ఆయన వల్ల ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరో ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి సైతం వైసీపీ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. రహస్య ఓటింగ్ పద్ధతిలో నిర్వహిస్తే… క్రాస్ ఓటింగ్ ఎలా వేస్తారంటూ సజ్జలను ప్రశ్నించారు. వైసీపీలో భజన పరులకే స్థానం ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఈ క్రాస్ ఓటింగ్‌పై వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యానించిన విషయం విదితమే. కోటంరెడ్డి మాత్రం తన ఆత్మప్రభోధానుసారం ఓట్లు వేశానని వివరణ ఇచ్చుకోగా, మేకపాటి సైతం వైసీపీ అభ్యర్థి జయమంగళకే ఓటు వేశానని, నా ఓటుతోనే ఆయన గెలిచాడని సమర్థించుకున్నారు. సస్పెన్షన్‌కు గురైన ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు అధికార పక్షంపై తిరుగుబావుటా వేయడంతో వైసీపీలో కలవరం మొదలైంది. గత్యంతరం లేక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చివరకు ఆ పార్టీ కింది స్థాయి నేతలతో సైతం వారిపై ఘాటుగా విమర్శలు చేయిస్తోంది. రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, మంత్రులు కాకాణి గోవర్థన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, రోజా, ఎంపీ నందిగం సురేష్‌తో పాటు ఎమ్మెల్యేలు మీడియా సమావేశాలలో ఇదంతా చంద్రబాబు స్క్రిప్టేనంటూ ఎద్దేవా చేస్తున్నారు.
టీడీపీపై ఎమ్మెల్యే రాపాక ఆరోపణలతో రచ్చ
అంతటితో ఆగకుండా జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్‌ను వైసీపీ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి… ఆయనకూ క్రాస్ ఓటింగ్ చేస్తే టీడీపీ డబ్బు ఎరజూపినట్లుగా ప్రచారం చేయిస్తున్నారు. తనకు రూ.10 కోట్లు, పార్టీ పదవి ఆఫర్ చేశారంటూ ఎమ్మెల్యే రాపాక వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది. తనతో టీడీపీ ఎమ్మెల్యే రామరాజు బేరం పెట్టారంటూ మీడియా ముందుకొచ్చి వ్యాఖ్యానించారు. ఆయన ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్యే రామరాజు, ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిరచారు. ఇదే అంశంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది.
సర్వం ‘సజ్జల’ మయం
వైసీపీలో అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డికే బాధ్యతలు అప్పగించడం, కీలక నిర్ణయాల్లోనూ ఆయన సలహాలనే తీసుకోవడంపై వైసీపీలో అసమ్మతి ఆరంభమైంది. తొలి విడత మంత్రివర్గ విస్తరణలోనూ కొందరు పార్టీ సీనియర్ నేతలు అలక వహించారు. రెండో విడత మంత్రివర్గంలో సీనియర్ ఎమ్మెల్యేలకు పదవులు దక్కనందున ఏకంగా రాజీనామా చేసినంత పని చేశారు. మంత్రివర్గంలో ఉన్న ఐదుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిలో కేవలం గుంటూరు జిల్లాకు చెందిన గత హోం మంత్రి మేకపాటి సుచరితను తొలగించి, మిగిలిన వారిని యథాతథంగా కొనసాగించడంపై ఆమె అధిష్టానంపై అసమ్మతితో ఉన్నారు. అప్పటి నుంచి ఆమె పార్టీ ముఖ్యనేతలతో సన్నిహితంగా మెలగడం లేదు. గత పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆళ్ల నానిని మంత్రివర్గం నుంచి తొలగించడంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఆయనా పార్టీలో క్రియాశీలకంగా ఉండటం లేదు. నెల్లూరు జిల్లాకు చెందిన కోటంరెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సైతం మంత్రి పదవులను ఆశించి భంగపాటుకు గురయ్యారు. తమకు మంత్రి పదవులు దక్కకపోవడానికి ప్రధాన కారణం సజ్జలేనని వారంతా వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా చాలా మంది అసమ్మతితో రగిలిపోతున్నారని, అవకాశం వచ్చినప్పుడు పార్టీని వీడేందుకు వారంతా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉండి కూడా నలుగురు పార్టీని వీడటం చర్చనీయాంశంగా మారింది. దీంతో వైసీపీలో అధికార ఎమ్మెల్యేలే తిరుగుబాటు ప్రారంభించారంటూ టీడీపీ స్పష్టం చేస్తోంది. అందుకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ అభ్యర్థి (టీడీపీ)కి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారని వ్యాఖ్యానిస్తోంది. దీనిపైనా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఘాటుగా స్పందిస్తున్నారు. చంద్రబాబు తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి క్రాస్ ఓటింగ్ వేయించుకున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మొత్తం మీద తిరుగుబాటు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్లతో కథ సుఖాంతం అవుతుందని అధిష్టానం ఆశించినప్పటికీ… వారంతా విమర్శలు చేయడంతో దిక్కుతోచని స్థితి నెలక