Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

అలనాటి నటి జమున కన్నుమూత

హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన సీనియర్‌ నటి
ఆమె వయసు 86 సంవత్సరాలు
పలు భాషల్లో నటించి, మెప్పించిన అందాల నటి

టాలీవుడ్‌ లో మరోసారి విషాదం చోటుచేసుకుంది. అలనాటి అందాల నటి జమున కన్నుమూశారు. హైదరాబాద్‌ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. 1936 ఆగస్ట్‌ 30న ఆమె జన్మించారు. అనారోగ్య కారణాలతో ఆమె మృతి చెందారు. తన అందంతోనే కాకుండా, అభినయం, నృత్యాలతో ఆమె ప్రేక్షకులను అలరించారు. ఆమె మాతృ భాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగు పరిశ్రమనే తన సొంత పరిశ్రమగా భావించి ఇక్కడే స్థిరపడిపోయారు. కర్ణాటకలోని హంపిలో ఆమె జన్మించారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ సినిమాల్లో ఆమె నటించారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో సైతం ఆమె రాణించారు. 1989 నుంచి 1991 వరకు రాజమండ్రి ఎంపీగా ఆమె ఉన్నారు. ఫిలింఫేర్‌తో పాటు పలు అవార్డులు ఆమెను వరించాయి. ఆమె మరణ వార్తతో టాలీవుడ్‌ షాక్‌ కు గురయింది. సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img