Monday, February 6, 2023
Monday, February 6, 2023

అలాంటి వార్తలతో దేశానికి చెడ్డపేరు

సోషల్‌మీడియాలో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ అసహనం
వెబ్‌ పోర్టల్స్‌, సోషల్‌ మీడియాల్లో నకిలీ, తప్పుడు వార్తల ప్రచారంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. కొన్ని మాధ్యమాలు ప్రతి వార్తకు మత కోణాన్ని చూపిస్తున్నారని, దీనివల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని విచారించింది. సోషల్‌మీడియా సంస్థలు నకిలీ వార్తలు వ్యాపిస్తున్నాయని, ఇలాంటి సంస్థలు జడ్జీలకు కూడా స్పందించడంలేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. సామాజిక మధ్యమ సంస్థలు కేవలం బలవంతులకు మాత్రమే స్పందిస్తున్నాయని, న్యాయవ్యవస్థల పట్ల సోషల్‌ మీడియా సంస్థలకు జవాబుదారీతనం లేదని సుప్రీంకోర్టు వెల్లడిరచింది. తబ్లిగీ జమాత్‌ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్వీ రమణ వ్యాఖ్యానిస్తూ.. సోషల్‌ మీడియా వేదికల్లో వార్తలకు మతం రంగు పూస్తున్నారని అన్నారు.దేశంలో ప్రతి విషయాన్ని మతకోణంలో చూపుతున్నారు. ఇది దేశంపై దుష్ప్రభావం చూపుతుందన్నారు. 2021 ఐటీ చట్టం సోషల్‌ మీడియాను నియంత్రిస్తుందని సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సమాధానం ఇచ్చారు. మళ్లీ ఆరు వారాల్లోగా ఈ కేసులో విచారణ చేపట్టనున్నట్లు సీజే తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img