వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు ఈ రోజు కూడా రాలేదు. తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ పై సుదీర్ఘ విచారణ సాగింది. అయితే ఈ రోజు తీర్పు ఇవ్వలేమని బెంచ్ తెలిపింది. వెకేషన్ బెంచ్ ని మార్చుకుంటారా అని జడ్జి అడిగారు. ఇది అర్జెంట్ అని, తీర్పు ఇవ్వాలని ఇరుపక్షాలు కోరాయి. అత్యవసరమైతే చీఫ్ జస్టిస్ బెంచ్ కు వెళ్లాలని న్యాయమూర్తి సురేంద్ర సూచించారు.రేపటి నుండి హైకోర్టుకు సెలవులు కాగా, ఈ నేపథ్యంలో వెకేషన్ తర్వాత తీర్పు ఇస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అర్జెన్సీ అయితే మాత్రం చీఫ్ జస్టిస్ ముందు మెన్షన్ చేసి అర్జెంట్ అని చెప్పండి అని సూచించారు.ఈ రోజు వాదనలు విన్నప్పటికీ ఈ రోజు తీర్పు ఇవ్వలేనని న్యాయమూర్తి తెలిపారు. ముందస్తు బెయిల్ పిటిషన్ తీర్పు అన్ని రోజులు రిజర్వ్ లో పెడితే బాగుండదన్నారు. సీబీఐ తన పని తాను చేసుకు పోవచ్చునని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకునేది ఉండదన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయని తెలిపారు. సీబీఐ విచారణ చేసుకోవచ్చునని చెప్పారు. అనంతరం ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేసింది.