Monday, January 30, 2023
Monday, January 30, 2023

అసమానతలు తొలగాలి – రాజ్యాంగ హక్కులు పొందాలి

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి భవిష్యత్తు రావాలి
26 నెలలుగా పారదర్శక పాలన
కార్పొరేట్‌కు దీటుగా సర్కారు బడులు
వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్లు..
దేశ, రాష్ట్ర ప్రజలకు నిండు మనస్సుతో శుభాకాంక్షలు
75వ స్వాతంత్య్ర దిన వేడుకలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అమరావతి : ‘రాజ్యాంగం కల్పించిన హక్కుల కల్పనే లక్ష్యంగా పాలనా వాతావరణం ఉండాలని, ఆర్థిక, సామాజిక వెనుకబాటు, అసమానతలు పోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు మంచి భవిష్యత్తు ఉండాలని, రేపు అనేది.. అందరికీ భరోసాగా నిలవాలని’ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో నిర్వహించిన 75వ స్వాతంత్య్ర దిన వేడులకు సీఎం జగన్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి, జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసు గౌరవ వందాన్ని స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించినే శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికీ, మొత్తంగా 140 కోట్ల భారతీయులకూ నిండు మనసుతో స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవా న్ని పురస్కరించుకుని పోలీసు అధికారులకు సేవా పతకా లను అందజేశారు. ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లా డుతూ.. చాలా కారణాల వల్ల ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబాటుకు గురైన మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మంచి భవిష్యత్తు ఉందన్న ఆత్మవిశ్వాసాన్ని నింపాలన్నారు. న్యాయబద్ధంగా వారి వాటా వారికి ఇవ్వాలని అన్నారు. ఒక దేశాన్ని మరో దేశం.. ఒక జాతిని మరోజాతి.. ఒక మనిషిని మరో మనిషి దోచుకోలేని వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆనాడు స్వాతంత్య్ర సమర యోధులు కలలుగన్నారని గుర్తుచేశారు. స్వతంత్ర దేశంగా గడచిన 74 సంవత్సరాలలో భారతీయులుగా, భారత దేశంగా మనం ఏం సాధించాం అని.. మన ప్రగతిని, మన వెనుకబాటును, జరిగిన మంచిని, చెడుని దేశం చర్చిస్తున్న సమయం ఇది, ఈ చర్చ జరగాలని పేర్కొన్నారు. లోపాల ను సరిదిద్దుకొనేందుకు, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేం దుకు, కొత్త బాటలు వేసుకునేందుకు మనందరికీ ఇది ఒక సందర్భమన్నారు. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వా లని, అందుకే పారదర్శక పాలన అందిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నా మని, 26 నెలల కాలంలో చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్ల వ్యయం చేశామని సీఎం వివరించారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామని, రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున పంపిణీ చేస్తున్నామన్నారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటి వరకు రూ.17 వేల కోట్లు ఇచ్చామని, 31 లక్షల మంది రైతులకు వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా అందిం చామని చెప్పారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతోపాటు ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగాలిచ్చామని, ప్రతినెలా ఒకటో తేదీనే గడప వద్దకే పింఛన్‌ అందిస్తున్నామని స్పష్టం చేశారు. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఆర్‌బీకేల ద్వారా సేవలు కొనసాగి స్తున్నామని, ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.1,039 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. ఏపీ అమూల్‌ పాల వెల్లువతో పాడి రైతులకు అండగా నిలిచామన్నారు. ‘నాడు-నేడు’ ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చామని, కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు.
మా ప్రభుత్వం.. మహిళా పక్షపాత ప్రభుత్వం
మా ప్రభుత్వం.. మహిళా పక్షపాత ప్రభుత్వమని, అక్కాచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని సీఎం చెప్పారు. అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13 వేల కోట్లు ఇచ్చామని, వైఎస్సార్‌ చేయూత ద్వారా రూ.9 వేల కోట్లు పంపిణీ చేశామని వివరించారు. డ్వాక్రా మహిళలకు ఇప్పటివరకు రూ.6,500 కోట్లు అందజేశామన్నారు. మహి ళల భద్రతకు దిశా చట్టం, దిశా పోలీస్‌స్టేషన్లు, దిశాయాప్‌ లు తీసుకొచ్చామని గుర్తుచేశారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చామని పేర్కొన్నారు. వైద్యం ఖర్చు వెయ్యి రూపాయిలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామన్నారు. కొత్తగా 16 వైద్య బోధనా ఆస్పత్రులు నిర్మిస్తున్నామని, అర్హత ఉన్న 61 లక్షల మందికి పింఛన్లు కేటాయిస్తున్నామని తెలిపారు. హక్కులకు, మానవ హక్కులకు, స్వతంత్రానికి అర్థం, ఎప్పటికప్పుడు మరింతగా విస్తరిస్తూ మారుతూ ఉంటుందని సీఎం వివరించారు. ఉదాహరణకు ఇంటర్‌నెట్‌ను 2011లోనే ఐక్యరాజ్యసమితి కనీస మానవ హక్కుగా గుర్తించిందని గుర్తు చేశారు. హక్కుల ప్రకటనకు, హక్కుల అమలుకు మధ్య ఉన్న ఈ తేడాను తగ్గిస్తూ, ఈ తేడాను చెరిపేసేందుకు 26 నెలలుగా ప్రజల ప్రభుత్వంగా ప్రతి ఒక్కటీ చేశామని అన్నారు.
పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశా..
వివిధ వర్గాలు ఏం కోరుకుంటున్నాయన్నదీ.. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశానని సీఎం జగన్‌ గుర్తు చేశారు. రైతులు తమ రెక్కలకు మరింత బలం కావాలని ఆకాంక్షించారు. అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మరింత సాధికారత ఇవ్వాలని కోరుకున్నారు. నేడు బడులకు, కాలేజీలకు వెళుతున్న పిల్లలు ప్రపంచంలో పోటీ పడగలగా లని కోరుకున్నారు. రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ మాత్రమే కాదనీ, రైట్‌ టు ఇంగ్లీష్‌ మీడియం ఎడ్యుకేషన్‌ కూడా ఉండాలని కోరుకున్నారని చెప్పారు. విద్యా రంగంలో ఒక విప్లవాత్మ కమైన మార్పులు తీసుకొచ్చామని, ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టామని, పాఠశాలల రూపురేఖలు మార్పు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకరు తమ్మినేని సీతారామ్‌, ఉప సభాపతి కోన రఘుపతి, ముఖ్యమంత్రి సతీమణి వైఎస్‌ భారతి, హోం మంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి శ్రీవెంకటేశ్వ రరావు(నాని), వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ వల్లభేని బాలశౌరి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌, మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, ఏపీ ఫైబర్‌ నెట్‌ చైర్మన్‌ గౌతమ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ ఉదయభాను, ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img