Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఆందోళనను విస్తరిస్తాం

రాకేష్‌ తిఖాయత్‌
తమ ఆందోళనను అన్ని మూలలకూ విస్తరిస్తామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్‌ తిఖాయత్‌ అన్నారు. సెప్టెంబరు 5 వ తేదీ తరువాత లక్నోకు దారి తీసే అన్ని రోడ్లనూ అన్నదాతలు దిగ్బంధం చేస్తారని,ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేస్తారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేష్‌ తిఖాయత్‌ ప్రకటించారు.యూపీ రాజధాని లక్నో.. దిల్లీ నగరంగా మారడం తథ్యమని అన్నారు. వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢల్లీిలో ఎలా ఆందోళన చేస్తున్నామో అలాగే లక్నో, తదితర నగరాల్లో కూడా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. ‘మిషన్‌ యూపీ అండ్‌ ఉత్తరాఖండ్‌’ తమ నినాదమని తెలిపారు. సెప్టెంబరు 5 న పశ్చిమ యూపీలోని ముజఫర్‌ నగర్‌ లో కిసాన్‌ మహాపంచాయత్‌ ను నిర్వహిస్తామని.. లక్షలాది రైతులు దీనికి హాజరవుతారని చెప్పారు. ఆందోళనలో భాగంగా భారీ ర్యాలీలు, మహా పంచాయత్‌ తో బాటు పలు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని మరో నేత యోగేంద్ర యాదవ్‌ తెలిపారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయులవరకు కూడా ఆందోళన సాగుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img