Monday, December 5, 2022
Monday, December 5, 2022

ఆగస్టు 14ను ‘విభజన గాయాల స్మారకదినం’గా జరుపుకుందాం

ప్రధాని మోదీ
ఇకపై ఆగస్టు 14ను ‘విభజన గాయాల స్మారకదినం’గా జరుపుకుందామని ప్రధాని శనివారం ప్రకటించారు. భారత్‌`పాక్‌ విభజన సమయంలో విద్వేషం, హింసకు అనేక మంది బలైపోయారన్నారు. విభజన బాధను ఎప్పటికీ మర్చిపోలేం.ఆనాడు జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, లక్షలాది మంది మన సోదర, సోదరీమణులు నిరాశ్రయులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సంఘర్షణ,త్యాగాలను స్మరించుకుంటూ ఆగస్టు 14ను విభజన గాయాల స్మారకదినంగా జరుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మరొక ట్వీట్‌లో, సామాజిక విభజనలు, అసమతౌల్యం, అపశ్రుతుల విషాన్ని తొలగించవలసిన అవసరం ఉందని విభజన గాయాలు గుర్తుకొచ్చే రోజుగా ఈ రోజు మనకు నిరంతరం గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. అంతేకాకుండా సమైక్య భావన, సాంఘిక సామరస్యం, మానవ సాధికారతలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img