Friday, February 3, 2023
Friday, February 3, 2023

ఆరుగురు సజీవదహనం కేసు.. దర్యాప్తు ముమ్మరం..

అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో సజీవదహానమైన ఆరుగురి మృతదేహాల కేసుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. మంచిర్యాల జిల్లా గుడిపల్లి సజీవదహనం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా డాగ్‌ స్వ్కాడ్‌ తో పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సజీవదహానమైన ఆరుగురి మృతదేహాలకు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. వివాహేతర సంబంధం కారణంగానే ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఇంటి సమీపంలో రెండు పెట్రోల్‌ క్యాన్లను పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి నిప్పుపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img