Monday, February 6, 2023
Monday, February 6, 2023

ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

బాలీవుడ్‌ బాద్షా షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది. బాంబే హైకోర్టులో ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వరుసగా రెండో రోజూ వాడి వేడిగా వాదనలు జరిగాయి.ఆర్యన్‌ ఖాన్‌, అర్బాజ్‌ మర్చంట్‌ తరపు లాయర్లు వాదనలు వినిపించిన తర్వాత ఎన్సీబీ తరపున లాయర్‌ వాదనలు వినిపించబోయారు. ఈలోపే ఈ పిటిషన్లను గురువారం వింటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో అటు షారూఖ్‌ కుటుంబానికి, అభిమానులకు, ఆర్యన్‌ ఖాన్‌కు నిరీక్షణ తప్పడం లేదు. ఇప్పటికే మేజిస్ట్రేట్‌ కోర్టులో, ప్రత్యేక కోర్టులో బెయిల్‌ తిరస్కరణకు గురవడంతో.. ఈ సారి హైకోర్టులో తప్పనిసరిగా బెయిల్‌ వస్తుందన్న ఆశతో షారూఖ్‌ కుటుంబం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img