Friday, August 12, 2022
Friday, August 12, 2022

ఆర్యసమాజ్‌లో వివాహలపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

పెళ్లి సర్టిఫికెట్లు జారీ చేయడం వారి పని కాదు. అది అధికారుల పని
తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం

ఆర్యసమాజ్‌లో పెళ్ల్లిళ్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి సర్టిఫికెట్లు జారీ చేయడం ఆర్య సమాజ్‌ పని కాదని సుప్రీం వ్యాఖ్యానించింది. ఆర్యసమాజ్‌ పెళ్లి సర్టిఫికెట్లు గురించబోమని తేల్చిచెప్పింది. ‘పెళ్లి సర్టిఫికెట్‌ ఇచ్చే హక్కు ఆర్యసమాజ్‌కు లేదు. ఆర్యసమాజ్‌ ఇచ్చే మ్యారెజ్‌ సర్టిఫికెట్‌ను గుర్తించే ప్రసక్తే లేదు. పెళ్లి సర్టిఫికెట్లు జారీ చేయడం వారి పని కాదు. అది అధికారుల పని.’ అని పేర్కొంది.మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ప్రేమ వివాహం కేసులో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జంట.. తమ కూతుర్ని కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేసినట్లు ఓ యువకుడిపై కేసు పెట్టింది. తమ కూతురు మైనర్‌ అని పేర్కొంది. పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. అయితే ఆ అమ్మాయి.. మేజర్‌ అని, ఇష్టపూర్వకంగానే తనను పెళ్లి చేసుకుందని ఆ యువకుడు ప్రమాణపత్రంలో పేర్కొన్నాడు. దీంతో పాటు ఆర్యసమాజ్‌లో వారి పెళ్లికి సంబంధించిన సర్టిఫికెట్‌ను సుప్రీం కోర్టుకు సమర్పించాడు.ఈ సర్టిఫికెట్‌ను జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ బీవీ నాగరత్న నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. ఆర్యసమాజ్‌కు పెళ్లి సర్టిఫికెట్లు ఇచ్చే హక్కు లేదని, దీనిని తాము పరిగణించబోమని తేల్చిచెప్పింది. వేరే ఏదైనా అర్హత కలిగిన సర్టిఫికెట్‌ ఉంటే చూపించాలని తెలిపింది.
పెళ్లి అనగానే ప్రేమ జంటలకు వెంటనే గుర్తొచ్చేది ఆర్యసమాజ్‌ మాత్రమే. పెద్దలు అంగీకరించని ఎన్నో ప్రేమ వివాహాలకు ఆర్యసమాజం వేదికగా నిలిచింది. ఇక్కడ జరిగే ప్రేమ పెళ్లిళ్లకు స్నేహితులే పెళ్లిపెద్దలుగా మారి, సాక్షి సంతకాలు చేస్తున్నారు. ఈ వేదికపై ఇప్పటి వరకు లక్షకు పైగా ప్రేమ జంటలు ఒక్కటయ్యాయి. ఎలాంటి ఆడంభరాలు లేకుండా హిందూ సంప్రదాయం ప్రకారం ప్రేమ జంటలను ఆర్య సమాజ్‌ ఒక్కటి చేస్తోంది. ఇక్కడ జరిగే పెళ్లిళ్లకు చట్టబద్ధత ఉండటంతో ఇక్కడ పెళ్లి చేసుకునేందుకు అనేక జంటలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఆర్యసమాజ్‌ ఇచ్చే పెళ్లి సర్టిఫికెట్లు చెల్లవని తేల్చి చెప్పింది.దేశవ్యాప్తంగా ఉన్న ఆర్యసమాజ్‌ శాఖల్లో ఏడాదికి సగటున 50 వేలకుపైగా వివాహాలు జరుగుతున్నాయి. తెలంగాణలోని వందకుపైగా శాఖల్లో ఏటా రెండు వేల వివాహాలు జరుగుతుండటం విశేషం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img