Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

ఇంధన ధరలపై ప్రధాని తప్పుదోవ పట్టిస్తున్నారు

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ
కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై సుంకాలు తగ్గించినా…కొన్ని రాష్ట్రాలు పన్నులు తగ్గించడంలేదని, ఇకనైనా ఆయా రాష్ట్రాలు పన్నులను తగ్గించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మోదీ వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. గడిచిన మూడేళ్లలో తమ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై సుమారు 1500 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్లు చెప్పారు. ప్రధాని మోదీ తప్పుదోవ పట్టించేలా వన్‌సైడ్‌గా మాట్లాడినట్లు ఆరోపించారు. ప్రధాని వెల్లడిరచిన అంశాలు అవాస్తవమని చెప్పారు. పెట్రోల్‌, డీజిల్‌పై తమ ప్రభుత్వం మూడేళ్ల నుంచి లీటర్‌పై ఒక రూపాయి సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. తమ రాష్ట్రానికి కేంద్రం బాకీ ఉందని, సుమారు 97 వేల కోట్లు కేంద్రం నుంచి రావాలని ఆమె అన్నారు. అయితే తమకు రావాల్సిన అమౌంట్‌లో సగం వచ్చినా.. ఆ మరుసటి రోజే 3000 కోట్ల పెట్రో సబ్సిడీ ఇవ్వనున్నట్లు తెలిపారు. సబ్సిడీతో తనకు సమస్య లేదని, కానీ ప్రభుత్వాన్ని నడపడం ఎలా అని ఆమె ప్రశ్నించారు. సీఎంలతో జరిగిన సమావేశంలో తమకు కౌంటర్‌ ఇచ్చే అవకాశం రాలేదన్నారు. పెట్రో సబ్సిడీ ఇస్తున్న యూపీ, గుజరాత్‌ రాష్ట్రాలను మోదీ పొగడడాన్ని ఆమె తప్పుపట్టారు. ఆ రాష్ట్రాలకు కేంద్రం మంచి ఆర్థిక సహకారం అందుతోందన్నారు. రాష్ట్రాలను తప్పుపట్టడం చాలా నీచమైన ఎజెండా అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బుల్డోజ్‌ చేయవద్దు ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img