Friday, December 1, 2023
Friday, December 1, 2023

ఇకపై అదనపు ధృవీకరణ తర్వాతే డబ్బులు కట్‌

ఆర్బీఐ కీలక నిర్ణయం
ఖాతాదారులకు ఊరటనిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఖాతాదారుల అకౌంట్‌ నుంచి నెలనెల డబ్బులు ఆటోమేటిక్‌గా కటింగ్‌ అయ్యే విషయంలో నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఖాతాదారుల నుంచి అదనపు ధృవీకరణ తర్వాతనే డబ్బులు కట్‌ అవుతాయని ఆర్బీఐ వెల్లడిరచింది. తొలి దశలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ విషయంలో ఈ నిబంధనను వర్తింపజేయబోతోంది. ఈ నిబంధనను అక్టోబర్‌ 1 నుంచి అమలు చేయనుంది. బ్యాంకింగ్‌ రంగంలో హ్యాకింగ్‌, ఆన్‌లైన్‌ మోసాలు, ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌ దొంగతనాలను నిలువరించేందుకు ఏఎఫ్‌ఏ నిబంధనను తీసుకొచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. ఆటోమేటిక్‌గా పేమెంట్‌ డిడక్ట్‌ అయ్యే సమయంలో మోసాలకు, ఆన్‌లైన్‌ దొంగతనాలకు ఆస్కారం ఉంది. అందుకే అడిషనల్‌ ఫ్యాక్టర్‌ ఆఫ్‌ అథెంటికేషన్‌ పద్దతి ద్వారా జరగాలని బ్యాంకులకు సూచిస్తున్నాం అని ఆర్బీఐ ప్రకటనలో తెలిపింది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img