Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

ఇది..పార్లమెంటును అవమానించడమే..

: ప్రధాని మోదీ
పార్లమెంట్‌ కార్యకలాపాలు సజావుగా సాగకుండా విపక్షాలు అడ్డుకోవడాన్ని ప్రధాని మోదీ తప్పుపట్టారు. ఇది పార్లమెంటు, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజలను అవమానించడమే అవుతుందని అన్నారు. . ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు.విపక్షాలు ఎంత గందరగోళం చేసినా పార్టీ ఎంపీలు మాత్రం సంయమనం పాటించాలని, సభా గౌరవాన్ని కాపాడాలని బీజేపీ ఎంపీలకు ఆయన సూచించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. పెగాసస్‌ వ్యవహారం, కొత్త సాగుచట్టాలు, తదితర అంశాలపై చర్చలు జరపాలని విపక్ష పార్టీలు నిరసన చేపడుతున్నాయి. నినాదాలతో సభ కార్యక్రమాలకు ప్రతిపక్షాలు ఆటంకం కలిగిస్తున్నాయని,రెండు సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరకర రీతిలో వ్యవహరిస్తున్నారని మోదీ అన్నారు.కాగా, మంగళవారం సైతం పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు వివిధ అంశాలను లేవనెత్తుతూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img