Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

ఈడీ విచారణకు హాజరైన రకుల్‌

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఇవాళ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరైంది. చార్టెడ్‌ అకౌంటెంట్‌, న్యాయవాదితో కలిసి ఆమె ఈడీ ఆఫీసుకు చేరుకుంది. డ్రగ్‌ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో రకుల్‌ని ఈడీ ప్రశ్నించనుంది. ఆమె బ్యాంకు అకౌంట్లను పరిశీలించనుంది. ఈ నెల 6న ఈడీ అధికారుల ముందు రకుల్‌ హాజరుకావలసి ఉంది. అయితే వరుస షూటింగులతో తాను బిజీగా ఉన్నానని, తనకు కొంత గడువు ఇవ్వాలని అడిగిందట.కాని గడువు ఇవ్వమని చెప్పిన ఈడీ ఈ రోజు రకుల్‌ని పిలించినట్టు సమాచారం. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) 12 మంది సెలబ్రిటీలకు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. మంగళవారం పూరీ జగన్నాథ్‌ని 10 గంటల పాటు విచారించారు. నిన్న ఛార్మీని ఈడీ విచారించింది. 8న రానా ఈడీ విచారణకి రానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img