Monday, January 30, 2023
Monday, January 30, 2023

ఈసారి రాకెట్లు, మానవబాంబులతో దాడులు


అమెరికా హెచ్చరిక
అఫ్ఘానిస్తాన్‌లో కాబూల్‌ విమానాశ్రయం వద్ద మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ జనరల్‌ ఫ్రాంక్‌ మెకంన్జీ పేర్కొన్నారు. ఈసారి ఉగ్రవాదులు రాకెట్లు, మానవబాంబులతో విమానాశ్రయం లక్ష్యంగా దాడులు చేయవచ్చని హెచ్చరించారు. విమానాశ్రయం బయట ఉన్న వ్యక్తులతో పాటుగా లోపల ఉన్నవారు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో నెలకొన్న సంక్షోభం కారణంగా దేశాన్ని విడిచి వెళ్లేందుకు ఆ దేశ ప్రజలతో పాటు ఇతర దేశాలకు చెందిన వారు వేల సంఖ్యలో కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే అమెరికాతో పాటు అనేక అగ్రరాజ్యాలు కాబూల్‌ విమానాశ్రయం వద్ద ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. అలా హెచ్చరించిన గంటల వ్యవధిలోనే గురువారం రాత్రి కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌ వద్ద దాడులు జరిగాయి. విమానాశ్రయం వద్ద జరిగిన ఈ జంట పేలుళ్ల ఘటనలో ఇప్పటి వరకు 103 మంది మృతిచెందారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img