Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఈసారి 25 లక్షలు

మన రికార్డు మనమే అధిగమించాలి
ఆ యంత్రాంగం మనకే ఉంది
వాక్సిన్‌ రాగానే మళ్లీ మెగా డ్రైవ్‌ : సమీక్షలో సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :
దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్కరోజే 14లక్షల టీకాలు వేసి రికార్డు సృష్టించిన మనం.. ఈసారి 25లక్షలు లక్ష్యంగా పెట్టుకుని మన రికార్డు మనమే అధిగమించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొవిడ్‌-19 నియంత్రణ, నివారణ, టీకా ప్రక్రియతో పాటు వైద్యశాఖలో నాడు-నేడుపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సోమవారం సమీక్షించారు. ఆదివారం రికార్డుస్థాయిలో వాక్సినేషన్‌ చేసిన సిబ్బందికి ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీకాలు అందుబాటులో ఉంటే ప్రజలకు చేరవేసే సమర్థత ప్రభుత్వానికి ఉందని నిరూపించారని కొనియాడారు. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, సచివాలయాల సిబ్బంది, పీహెచ్‌సీల సిబ్బంది, ఇలా గట్టి యంత్రాంగం మనకు ఉందన్నారు.
కొత్త వైద్య కాలేజీల నిర్మాణం వేగవంతం
కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని సూచించారు. కార్పొరేట్‌ ఆస్పత్రులతో పోటీపడుతున్నందున ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదని స్పష్టం చేశారు. అనుకోని ప్రమాదాలు వచ్చే సమయంలో రోగులను సురక్షితంగా ఖాళీచేయించే అత్యవసర ప్రణాళికలు సమర్థవంతంగా ఉండాలన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులు అనుసరించే ప్రోటోకాల్స్‌పై అధ్యయ నం చేయాలని, అన్ని అంశాలనూ అధ్యయనం చేశాక సమగ్ర వివరా లతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తూర్పుగోదావరి మినహా అన్నిజిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని అధికారులు వివరించగా, పొరుగురాష్ట్రాల్లో ఆంక్షలు సడలిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ క్రియాశీల కేసులు 2772 ఉన్నాయని, వీరిలో 922 మందికి సర్జరీలు చేయగా, 212 మంది మృతి చెందారని అధికారులు వెల్లడిరచారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,37,42, 417 డోసుల టీకాలు వేశామని, వీటిలో 82,77,225 మందికి మొద టి డోసు, 27,32,596 మందికి రెండు డోసుల టీకాలు వేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, డీజీపీ గౌతం సవాంగ్‌, కొవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి(కొవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌, 104 కాల్‌సెంటర్‌ ఇన్‌ఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లిఖార్జున్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img