Monday, January 30, 2023
Monday, January 30, 2023

ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం ఏడుగురు మృతి

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాల ధాటికి నైనిటాల్‌ జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదఘటనల్లో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. సహాయకచర్యలు జరుగుతూనే ఉన్నాయి. కేదర్‌నాథ్‌ ఆలయానికి వెళ్లి వరదలో చిక్కుకున్న 22 మంది భక్తులను ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు, పోలీసులు కలిసి కాపాడారు. బద్రీనాథ్‌ నేషనల్‌ హైవేకు సమీపంలోని లాంబగడ్‌ నల్లాప్‌ా వద్ద వరదలో చిక్కుకున్న కారును క్రేన్‌ సహాయంతో బయటకు తీశారు.వరదల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో..నైనిటాల్‌కు రాకపోకలు ఆగిపోయాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img