Friday, February 3, 2023
Friday, February 3, 2023

ఉద్యమ శిబిరం వద్ద యువరైతు దారుణహత్య

కాళ్లు, చేతులు నరికి బారికేడ్లకు వేలాడదీత
ఇద్దరు నిందితుల అరెస్టు

ఛండీగఢ్‌/న్యూదిల్లీ : రైతు ఉద్యమాన్ని అణచే లక్ష్యంతో అనేక ఉన్మాద చర్యలు కొనసాగుతున్నాయి. రైతులను భయపెట్టడానికిగాను ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో కేంద్రమంత్రి తనయుడి కాన్వాయ్‌ రైతులపైకి దూసుకుపోవడం, తాజాగా హరియా ణాలోని సోనిపట్‌ జిల్లా కుంద్లీ సమీపంలో గల రైతు ఉద్యమ శిబిరం వద్ద ఓ వ్యక్తిని దారుణంగా చంపడం అనేక అనుమా నాలకు తావిస్తోంది. హరియాణాలోని సోనిపట్‌ జిల్లాలో రైతులు ఆందోళన నిర్వహిస్తోన్న ప్రాంతంలో ఒకరు దారుణ హత్యకు గురైన ఘటన కలకలం సృష్టించింది. తీవ్ర సంచ లనం సృష్టించిన ఈ హత్య కేసులో ఒకడు శుక్రవారం లొంగి పోగా మరొకడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. అతడిని సరబ్‌జిత్‌ సింగ్‌ అలియాస్‌ నిహాంగ్‌ సిక్కుగా అధికారులు గుర్తించారు. రైతుల దీక్షాస్థలి వద్ద జరిగిన హత్యకు బాధ్యత వహిస్తూ నిందితుడు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఓ యువకుడి చేతులు, కాళ్లు నరికి… బారికేడ్లకు వేలాడతీసిన విషయాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గురైన వ్యక్తిని లఖ్‌బీర్‌ సింగ్‌(35)గా గుర్తించారు. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన దిల్లీ శివార్లలోని రైతుల నిరసన ప్రదేశంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ హత్యకు తామే బాధ్యులమని నిహాంగ్‌(గురుద్వారాల పరిరక్షణ దళాలు) బృందం ప్రకటించింది. తమ పవిత్ర ‘సర్బలోప్‌ా గ్రంథ్‌’ని లఖ్‌బీర్‌ కాల్చడానికి ప్రయత్నించడం వల్లే ఈ హత్య చేశామని నిహాంగులు తెలిపారు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్‌ సాహిబ్‌ను అపవిత్రం చేసినందుకే అతడ్ని శిక్షించానంటూ నీలిరంగు వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి పోలీసులకు లొంగిపోయాడు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ… మళ్లీ ఎవరైనా ఇలాంటి నేరాలు చేయడానికి సాహసిస్తే చంపడానికి వెనుకాడబోమని హెచ్చరించాడు. ‘జో బోలే సో నిహాల్‌’ నినాదాల మధ్య సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు బాధ్యత వహిస్తు న్నట్లు ప్రకటించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని దీఎస్పీ హంసరాజ్‌ తెలిపారు. నిందితుడిని శనివారం కోర్టుకు హాజరుపర్చగా మేజిస్ట్రేట్‌ వారం రోజుల రిమాండ్‌ విధించారు. బాధితుడు పంజాబ్‌లోని తార్న్‌ తరణ్‌ జిల్లా చీమా ఖుర్ద్‌ గ్రామ నివాసి లఖ్‌బీర్‌ సింగ్‌ అని, అతడు దళిత వ్యవసాయ కూలీ అని గుర్తించారు. అతనిపై ఎలాంటి నేరచరిత్ర గానీ, ఏ రాజకీయ పార్టీతో సంబంధం గానీ లేదని పోలీసులు తెలిపారు. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 11 నెలల పాటు నిరసనను సమన్వయం చేస్తున్న సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ హత్యను తీవ్రంగా ఖండిరచింది. నిహంగ్‌ సమూహానికి, మరణించిన వ్యక్తికి కిసాన్‌ మోర్చాతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ ఏ మతం ఇవ్వదని, నేరస్తులను చట్టానికనుగుణంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. ఈ విషయంలో పోలీసులకు పూర్తి మద్దతునిస్తామని పేర్కొంది. కాగా, ఈ కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సిక్కు నిహంగులశాఖకు చెందిన నారాయణ్‌ సింగ్‌ను అమృత్‌సర్‌ రూరల్‌ పోలీసులు అమర్‌కోట్‌ వద్ద అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img