Friday, June 9, 2023
Friday, June 9, 2023

ఉద్యోగులకు డీఏ… పెన్షనర్లకు డీఆర్‌ మంజూరు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఉద్యోగులకు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డీఏ ను మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబరు 66 ద్వారా ఉద్యోగులకు డీఏ, జీవో 67 ద్వారా పెన్షనర్లకు డీఆర్‌ 2.73శాతం మంజూరు చేశారు. ఈ కొత్త డీఏను 1 జులై 2023నుంచి వేతనంతో కలిపి ఇస్తారు. జనవరి 2022నుంచి జూన్‌ 2023 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను సెప్టెంబరు, డిసెంబరు, మార్చి నెలల్లో 3 సమాన వాయిదాల్లో ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లిస్తారు. కొత్త డీఏతో కలిపి ఉద్యోగుల మొత్తం డీఏ 22.75శాతం అవుతుందని ఉత్తర్వులో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం డీఏ మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకటరామిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img