Tuesday, March 28, 2023
Tuesday, March 28, 2023

ఎంఎస్‌ఎంఈలకు కష్టాలు

. 10,655 సంస్థల మూత
. నాలుగేళ్లలో ఇదే గరిష్ఠం
. కలిసిరాని 2022`23 వత్సరం

న్యూదిల్లీ: లఘు, చిన్న, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్‌ఎంఈ)లకు 202223 ఆర్థిక సంవత్సరం ఏ మాత్రం కలిసిరాలేదు.10,655 ఎంఎస్‌ఎంఈలు మూతపడటంతో 202223 అత్యంత క్లిష్ట వత్సరంగా పరిణమించింది. నాలుగేళ్లలో ఇంతలా చిన్న సంస్థలు మూతపడలేదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కొనసాగుతుండటంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని కేంద్రప్రభుత్వం రాజ్యసభకు రాతపూర్వకంగా తెలిపింది. 2021-22లో మూతపడిన ఎంఎస్‌ఎంఈల సంఖ్య 6,222 కాగా 2020-21లో 175, 2019-20లో 400గా ఉన్నట్లు ప్రభుత్వ డేటా పేర్కొంది. కొత్త పరిశ్రమల ప్రారంభం, మూతపడిన పరిశ్రమల నిష్పత్తి క్రమంగా క్షీణించినట్లు వెల్లడిరచింది. 202021లో మూతబడిన ప్రతి 175 సంస్థల్లో ఒకదాని స్థానె 11వేల కొత్త సంస్థలు మొదలు కాగా 202122లో ప్రారంభించిన సంస్థల సంఖ్య 349కు తగ్గింది. అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంఖ్య 167కు దిగజారింది. దీంతో ఎంఎస్‌ఎంఈలపై ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్‌ లాక్‌డౌన్‌లతో చిన్న పరిశ్రమలు కుదేలయ్యాయని, నిరుద్యోగం తారస్థాయికి పెరిగిందని, ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిరదని అన్నారు. గణాంక నిపుణుడు ప్రణబ్‌ సేన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎంఎస్‌ఎంఈ రంగం పరిస్థితి గురించి మాట్లాడారు. ఈ రంగం ఆర్థిక వ్యవస్థకు 30శాతం, ఉపాధికి 40శాతం తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. తాజా పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ఎంఎస్‌ఎంఈ సమస్యకు సత్వర పరిష్కారం అవశ్యమని నొక్కిచెప్పారు. మహమ్మారి కాలంలో మూతపడిన 20 శాతం స్థానంలో కొత్త ఎంఎస్‌ఎంఈలను ప్రారంభించడం ఎంతో అవసరమని సేన్‌ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img