Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా సంసాద్‌ టీవీ నుంచి వైదొలిగిన శశిథరూర్‌

రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలకు సంఫీుభావం తెలిపేందుకు కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ ఎంపీ శశి థరూర్‌ సంసద్‌ టీవీ చర్చా కార్యక్రమం హోస్ట్‌గా వైదొలిగారు.ఈ మేరకు థరూర్‌ ట్విట్టర్‌ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించారు. సంసద్‌ టీవీలో టాక్‌ షో ‘టు ది పాయింట్‌’ హోస్ట్‌గా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శశి థరూర్‌ సోమవారం ట్విట్టర్‌ పోస్ట్‌లో తెలిపారు. ‘సంసద్‌ టీవీ షోను హోస్ట్‌ చేయమనే ఆహ్వానాన్ని అంగీకరించడం భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం యొక్క ఉత్తమ సంప్రదాయమని నేను నమ్మాను. ‘అయితే గత సెషన్‌లో చేసిన చర్యలకు ఏకపక్ష పద్ధతిలో రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలను సుదీర్ఘంగా సస్పెండ్‌ చేయడం, పార్లమెంటు పనిని చైతన్యవంతం చేసే ద్వైపాక్షిక స్ఫూర్తిని ప్రశ్నార్థకం చేసింది. సోమవారం ఉదయం నిరసనకారులకు నా సంఫీుభావాన్ని తెలియజేయడానికి సంసద్‌ టీవీలో షో హోస్ట్‌ నుంచి వైదొలుగుతున్నాను’’ అని శశిథరూరర్‌ పేర్కొన్నారు. అంతకుముందు రాజ్యసభలో సస్పెన్షన్‌ కు గురై 12 మంది ఎంపీలలో శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా సంసద్‌ టీవీ షో ‘మేరీ కహానీ’ యాంకర్‌గా తప్పుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img