. అనర్హత తదుపరి న్యాయపరమైన ప్రకటనలకు లోబడి నిలిపివేత
. లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్
. సభకు హాజరైన ఫైజల్
న్యూదిల్లీ : ఎన్‌సీపీ నేత మహ్మద్ ఫైజల్‌కు భారీ ఊరట లభించింది. ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. 10 వారాల తర్వాత ఆయనపై అనర్హత వేటును ఉపసంహరించడంతో బుధవారం లోక్‌సభ సమావేశాలకు తిరిగి హాజరయ్యారు. ఈ విషయంలో ఫైజల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీం కోర్టులో విచారణ జరగనున్న కొన్ని గంటల ముందు ఆయనపై అనర్హత వేటు తొలగింది. లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్, దిగువ సభలో లక్షద్వీప్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫైజల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. మహ్మద్ ఫైజల్‌కు క్రిమినల్ కేసులో శిక్ష విధించడంపై కేరళ హైకోర్టు స్టే విధించడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వంపై గతంలో జారీ చేసిన అనర్హత తదుపరి న్యాయపరమైన ప్రకటనలకు లోబడిన నిలిపివేసినట్లు పేర్కొంది. కాగా, ఫైజల్ లక్షద్వీప్ నుంచి 2019లో ఎంపీగా గెలుపొందారు. అయితే కవరత్తిలోని సెషన్స్ కోర్టు… 2009 లోక్‌సభ ఎన్నికల సమయంలో దివంగత కేంద్ర మంత్రి పిఎం సయీద్ అల్లుడు మహ్మద్ సలీప్‌ాపై హత్యాయత్నం కేసులో మహ్మద్ ఫైజల్‌ను దోషిగా నిర్దారించింది. సలీప్‌ాను హత్యచేయడానికి ప్రయత్నించినందుకు ఫైజల్‌తో పాటు మరో ముగ్గురికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా విధిస్తూ ఈ ఏడాది జనవరిలో తీర్పు వెలువరించింది. దీంతో ఫైజల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిరది. జనవరి 13న లోక్‌సభ సెక్రటేరియట్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. కవరత్తిలోని సెషన్స్ కోర్టు హత్యాయత్నం కేసులో దోషిగా తేల్చిన నేపథ్యంలో జనవరి 11 నుంచి లోక్‌సభ సభ్యత్వానికి ఫైజల్ అనర్హుడని ప్రకటించింది. అయితే దీనిని ఫైజల్… కేరళ హైకోర్టులో సవాలు చేశారు. ఈ క్రమంలోనే జనవరి 25న కేరళ హైకోర్టు… కవరత్తిలోని సెషన్స్ కోర్టు తీర్పు అమలును నిలిపివేసింది. అయితే ఆ తర్వాత కూడా ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. దీంతో లక్షద్వీప్ ఎంపీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గుజరాత్‌కు చెందిన సూరత్‌లోని ట్రయల్ కోర్టు పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి, రెండేళ్ల జైలు శిక్ష విధించిన నేపథ్యంలో రాహుల్ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ తీర్పుపై గాంధీ ఇంకా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించలేదు. ఫైజల్ సస్పెన్షన్‌ను రద్దు చేయడాన్ని ఎన్‌సీపీ స్వాగతించింది. అయితే లోక్‌సభ సచివాలయం ఆలస్యం చేయడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘లోక్‌సభ సచివాలయం నుంచి ఇది ఊహించలేదు. నా శిక్షను హైకోర్టు సస్పెండ్ చేయడంతో ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ ఇతర రాజ్యాంగ సంస్థ ఫైళ్లపై కూర్చుంది. లోక్‌సభ సచివాలయం తరపున ఇది న్యాయమైనది కాదు’ అని ఫైజల్ ఇక్కడ విలేకరులతో అన్నారు. బుధవారం లోక్‌సభకు హాజరైన ఫైజల్, తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని అన్నారు. ఎన్‌సీపీ ఫ్లోర్ లీడర్ సుప్రియా సూలేతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిశారు. ‘కేరళ హైకోర్టు 25.01.2023 నాటి ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని, మహమ్మద్ ఫైజల్ పి.పి.పై అనర్హత వేటు వేయడం, గెజిట్ నోటిఫికేషన్ నంబర్ 21/4(1)/2023/ టూ (బి) 13 జనవరి, 2023 నాటి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(ఈ) నిబంధనల ప్రకారం ప్రజాప్రాతినిధ్య చట్టం`1951లోని సెక్షన్ 8తో చదవబడిరది. తదుపరి న్యాయపరమైన ప్రకటనలకు లోబడి నిలిపివేయబడిరది’ అని లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్ పేర్కొంది. కాగా, హత్యాయత్నం కేసులో కేరళ హైకోర్టు తన శిక్షపై స్టే విధించిందంటూ ఫైజల్ మంగళవారం లోక్‌సభకు తన అనర్హత వేటును రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఎన్‌సీపీ జాతీయ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ ‘కేరళ హైకోర్టు జనవరి 25న అతని నేరారోపణ, శిక్షను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే అనర్హత రద్దు చేయాలి. ఆలస్యం అయినప్పటికీ, ఇది స్వాగతించదగిన చర్య’ అని అన్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ జనవరి 30న స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమై లక్షద్వీప్ ఎంపీ సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలని అభ్యర్థించారు. అనర్హత వేటు తర్వాత, ఎన్నికల సంఘం జనవరి 18న లక్షద్వీప్ పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికను ప్రకటించింది. అయితే జనవరి 30న, కేరళ హైకోర్టు నిర్ణయం తర్వాత ‘ఉప ఎన్నికను నిలిపివేయాలని’ నిర్ణయించింది.