రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ ) అధ్యక్షుడు శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఎన్సీపీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని పవార్ ఇవాళ ఉదయం ప్రకటించారు.అయితే, పవార్ ఇంత అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? ఆయన ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటే తన వారసుడిగా లేదా వారసురాలిగా ఎవరికి ఆ బాధ్యతలు కట్టబెట్టబోతున్నారు అనే వివరాలు తెలియాల్సి ఉంది