Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

ఎల్జీది కాదు.. కేజ్రీ స‌ర్కార్‌దే ప‌వ‌ర్ : సుప్రీంకోర్టు

ఢిల్లీ పాల‌నా వ్య‌వ‌హారాల‌పై ఇవాళ సుప్రీంకోర్టు కీల‌క తీర్పును వెలువ‌రించింది. చాన్నాళ్లుగా ఢిల్లీ స‌ర్కార్‌, ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య జరుగుతున్న వివాదానికి సుప్రీం బ్రేక్ వేసింది. ఈ కేసులో 2019 నాటి సింగిల్ జ‌డ్జీ తీర్పుతో ఏకీభ‌వించ‌డం లేద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం తెలిపింది. ఢిల్లీ ప్ర‌భుత్వానికి అధికారాలు లేవ‌న్న విష‌యాన్ని తాము అంగీక‌రించబోమ‌న్న‌ది. ఢిల్లీ ప్ర‌భుత్వం, ఎల్జీ మ‌ధ్య జ‌రిగిన వివాదంపై జ‌స్టిస్ అశోక్ భూష‌ణ్ 2019లో తీర్పును వెలువ‌రించారు. అయితే ఆ తీర్పును తాము అంగీక‌రించ‌డం లేద‌ని ఇవాళ సీజేఐ డీవై చంద్ర‌చూడ్ తెలిపారు. దీంతో సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ ప్ర‌భుత్వానికి భారీ విజ‌యం ద‌క్కింది. అధికారుల‌ను నియ‌మించే అధికారం రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉన్న‌ట్లు సుప్రీం తెలిపింది.

ఇక అన్ని రాష్ట్రాల త‌ర‌హాలోనే ఢిల్లీలో పాల‌న ఉంటుంద‌ని సుప్రీం తెలిపింది. ల్యాండ్‌, పోలీస్‌, లాపై అధికారం కేంద్రానికి ఉంటుంద‌ని కోర్టు చెప్పింది. మిగిలి అన్ని అంశాల‌పై శాస‌నాధికారం కేజ్రీ స‌ర్కార్‌కు ఉంటుంద‌ని కోర్టు చెప్పింది. సీజేఐ చంద్ర‌చూడ్ తీర్పును చ‌దివి వినిపించారు. అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాసనం ఇవాళ ఏక‌గ్రీవ తీర్పును వెలువ‌రించింది. రాష్ట్ర ప్ర‌భుత్వ పరిపాల‌నా వ్య‌వ‌హార‌ల‌ను కేంద్ర స‌ర్కార్ టేకోవ‌ర్ చేసుకోరాదు అని రాజ్యాంగ ధ‌ర్మాస‌నం త‌న తీర్పులో వెల్ల‌డించింది. ధ‌ర్మాస‌నంలో సీజేఐతో పాటు జ‌స్టిస్ ఎంఆర్ షా, కృష్ణ‌మురారీ, హిమా కోహ్లీ, పీఎస్ నర్సింహాలు ఉన్నారు. ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌భుత్వ‌మే ఆఫీస‌ర్ల‌పై నియంత్ర‌ణ క‌లిగి ఉండాల‌ని, ఒక‌వేళ అలా ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌భుత్వానికి ఆఫీస‌ర్ల‌పై నియంత్ర‌ణ లేకుంటే, అప్పుడు ఆ స‌ర్కార్ బాధ్య‌త స‌న్న‌గిల్లుతుంద‌ని కోర్టు చెప్పింది. ప్ర‌భుత్వానికి ఆఫీస‌ర్లు స్పందించ‌కుంటే, అప్పుడు స‌మిష్ట బాధ్య‌త నీరుగారే అవ‌కాశం ఉంద‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img