Sunday, May 28, 2023
Sunday, May 28, 2023

ఏపీలో దంచికొడుతున్న ఎండలు..వేడిగాలులతో పాటూ ఉక్కపోత

జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. మూడు రోజులుగా సూర్యుడి ప్రతాపం కనిపిస్తోంది.. ఉక్కపోతు, వేడి గాలులతో జనాలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. మంగళవారం కూడా అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈరోజు 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉంది. సోమవారం 18 మండలాల్లో తీవ్రవడగాల్పులు , 131 మండలాల్లో వడగాల్పులు వీచాయి. నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4°Cలు, ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో 46.2°Cలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణాల్లో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు. నేడ (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 48°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 48°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు.శ్రీసత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఇవాళ తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు : గుంటూరు జిల్లా దుగ్గిరాల,కొల్లిపర,.మంగళగిరి, పెదకాకాని,తాడేపల్లి, తాడికొండ,తుళ్ళూరు,
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం, ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో తీవ్రవడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది అంటోంది విపత్తుల నిర్వహణ సంస్థ.

వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు : అల్లూరి జిల్లా 5, బాపట్ల 18, తూర్పుగోదావరి 19, ఏలూరు 28, గుంటూరు 8, కాకినాడ 8, కోనసీమ9, కృష్ణా 15, ఎన్టీఆర్‌ 14, పల్నాడు 23, మన్యం 8, ప్రకాశం 6, శ్రీకాకుళం 1, నెల్లూరు 7, విజయనగరం 2, పశ్చిమగోదావరి జిల్లాలోని 11, వైఎస్సార్‌ 12 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది అన్నారు.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img