Friday, June 9, 2023
Friday, June 9, 2023

ఏపీ అసెంబ్లీలో స్పీకర్ కొత్త రూలింగ్.. ఇకపై ఆటోమేటిక్‌ సస్పెన్షన్!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం వాడీవేడిగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది.. ఈ క్రమంలో హై టెన్షన్ కనిపించింది. అనంతరం స్పీకర్ టీడీపీ సభ్యుల్ని స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. అలాగే స్పీకర్ కొత్త రూలింగ్ తీసుకొచ్చారు. సభలో ఎవరైనా స్పీకర్ స్థానాన్ని గౌరవించాలని.. నిరసన వ్యక్తం చేయడంపై అభ్యంతరం లేదన్నారు. సభాపతి స్థానానికి వచ్చిన సభ గౌరవాన్ని, హోదాలకు తగ్గించే విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించడం ఆక్షేపణీయమన్నారు స్పీకర్. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని.. అందుకే రూలింగ్ ఇస్తున్నాను అన్నారు.ఇకపై సభలో సభ్యులు ఎటువంటి పరిస్థితుల్లో సభ్యులు పోడియం దగ్గరకు వచ్చి సభాపతి స్థానాన్ని అగౌరవపరిచే విధంగా ప్రవర్తిస్తే ఆటోమేటిక్ సస్పెన్షన్ రూల్‌ను ఇన్వోక్ చేస్తున్నానని తెలియజేస్తున్నానుః అన్నారు. టీడీపీ సీనియర్‌ సభ్యులు స్పీకర్ పోడియంపైకి రావడం దురదృష్టకరమన్నారు స్పీకర్‌ తమ్మినేని. తనపై దురుసుగా ప్రవర్తించడం సీనియారిటీనా.. బడుగు, బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపా.. తన ఛైర్ దగ్గరకు వచ్చే హక్కు సభ్యులకు లేదన్నారు. తనకు సభలో సభ్యులంతా సమానమేనన్న స్పీకర్.. సభలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. స్పీకర్‌ చైర్‌ను టచ్‌ చేసి ముఖంపై ప్లకార్డులు ప్రదర్శించారని.. అంత జరిగినా టీడీపీ సభ్యుల వైఖరిని మౌనంగానే భరించాను అన్నారు.సభను సజావుగా నడిపించడమే తన కర్తవ్యమని.. సభ్యుల హక్కులు పరిరక్షించడం తన బాధ్యత అన్నారు. సభా సమయంతో పాటూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో రోజాను ఏడాది పాటూ సస్పెండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక్కడ సభలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తారన్నారు. అందుకే సభ్యులు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. గతంలోనే అసెంబ్లీలో సభ్యులు రెడ్ లైన్ దాటకూడదని రూలింగ్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img