Monday, September 26, 2022
Monday, September 26, 2022

ఏపీ, తెలంగాణకు వర్ష సూచన

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడి నేడు పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు చోట్ల నేడు, రేపు ఓ మోస్తరు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తా, యానాంలలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు, లేదంటే ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దక్షిణ కోస్తాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న అధికారులు.. రాయలసీమలో నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img