Monday, March 27, 2023
Monday, March 27, 2023

ఏపీ, తెలంగాణ విభజన సమస్యలపై 17న కేంద్ర హోంశాఖ కీలక సమావేశం

తెలుగురాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ఏరాప్టఉ చేయబోతోంది. . కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఈ సమావేశం నిర్వహించనుంది. ఈ నెల 17న ఉదయం 11 గంటలకు కమిటీ తొలి భేటీ నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాని అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి.ఏయే అంశాలు చర్చించాలన్న విషయంపై అధికారులకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే సమాచారం అందించింది. షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల విభజన, ఆస్తుల పంపకాలపై చర్చ జరుపుతామని తెలిపింది. అలాగే, ఆర్థికపరమైన అంశాలపై చర్చ జరగనుంది.కాగా, విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 8న జరిగిన సమావేశంలో కేంద్ర హోం శాఖ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎస్‌ఎస్‌ రావత్‌, తెలంగాణ నుంచి రామకృష్ణారావు ఉన్నారు.
సమావేశంలో చర్చకు వచ్చే ప్రధాన అంశాలు
ఏపీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన, విద్యుత్‌ వినియోగ అంశాలు, పన్ను అంశాల్లో సవరణలు, ఏపీఎస్‌సీఎస్‌సీఎల్‌, టీఎస్‌సీఎస్‌సీఎల్‌ సంస్థలో నగదు అంశం, వనరుల సర్దుబాటు, 7 వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి నిధుల అంశం, ప్రత్యేక హోదా, పన్ను ప్రోత్సాహకాలు, వనరుల వ్యత్యాసం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img