Monday, March 27, 2023
Monday, March 27, 2023

ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అధికారుల ఇళ్లలో సీఐడీ తనిఖీలు

నిధులను మళ్లించారనే అభియోగాలతో సోదాలు
విజయవాడ మేనేజర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న అధికారులు
గతంలో కూడా సోదాలు నిర్వహించిన సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ

మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్లు, కీలక అధికారుల నివాసాల్లో ఏపీ సీఐడీ సోదాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ ఉదయం నుంచి సీఐడీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కంపెనీ నిధులను మళ్లించారనే అభియోగాలతో సోదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలను నిర్వహించారు. నిధుల మళ్లింపుపై సీఐడీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదు చేయడంతో తాజాగా సోదాలను చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img